అసెంబ్లీ ముట్టడి
- శాంతియుత ధర్నాకు అనుమతి ఇవ్వరా?
- బీజేపీని చూసి భయపడుతున్న కాంగ్రెస్
- నిరసన తెలిపే హక్కు మాకు లేదా?
- రీయింబర్స్‌మెంట్, 22 ఏ పై చర్చ జరగకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాటకాలు
- స్పీకర్‌పై ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- విద్యార్థుల ఫీజు బకాయిలపై బీజేపీ ఉద్యమం ఆగదు: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): సీఎం ఢిల్లీ(CM Delhi)కి తిరుగుతారు.. కానీ విద్యార్థుల సమస్యల(Students problems)పై స్పందించేందుకు మాత్రం సమయం లేదా?, బీజేపీ(Bharatiya Janata Party)ని చూసి కాంగ్రెస్(Congress) ఎందుకు భయపడుతున్నది, నిరసన తెలిపే హక్కు తమకు లేదా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు(N Ramchander Rao) ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement), 22 ఏ పై చర్చ జరగకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. స్పీకర్ చైర్‌ను గౌరవించాలని, స్పీకర్‌పై చేసిన ఆ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు.
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించేదాకా బీజేపీ ఉద్యమం ఆగదని, శాంతియుత ధర్నాకు అనుమతి నిరాకరించినందుకే అసెంబ్లీని ముట్టడించామన్నారు. సోమవారం ఆందోళనలో.. అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతోపాటు పార్టీ నాయకులు, బీజేవైఎం నాయకులను(BJYM leaders) పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. రాంచందర్ రావును అరెస్టు చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్(Golconda Police Station)కు తరలించారు.
గోల్కొండ పోలీస్ స్టేషన్ వద్ద, అనంతరం పార్టీ కార్యాలయంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అనేక రోజులుగా బీజేపీ పోరాటం చేస్తోందని, విద్యార్థుల సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో ముఖ్యమంత్రిని కలవాలని కోరినా.. సీఎం స్పందించలేదని.. విద్యార్థుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం ఢిల్లీకి తిరుగుతూనే ఉన్నారు కానీ.. విద్యార్థుల సమస్యపై కనీసం స్పందించే సమయం మాత్రం లేదన్నారు.
8 లక్షల సంతకాలతో చీఫ్ సెక్రటరీని కలవడానికి వెళ్తే.. సెక్రటేరియట్ గేటు దగ్గరే తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. విద్యార్థులతో సమావేశం పెట్టడానికి పోలీసుల అనుమతి కోరితే మొదట ఇస్తామన్నారు.. చివరకు ‘పై నుంచి ప్రెజర్ ఉంది’ అంటూ అనుమతి నిరాకరించారని గుర్తుచేశారు.
బీజేపీ శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?, విద్యార్థులకు, బీజేపీకి కార్యక్రమాలు నిర్వహించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయాలపై, తమ జిల్లా అధ్యక్షుల ఇళ్లపై దాడు లు జరుగుతున్నాయని, అసలు రాష్ట్రంలో శాంతి, చట్టవ్యవస్థ ఉన్నాయా అని ప్రజలు అడుగుతున్నారన్నారు.
డ్రామాలు ఆపి సమస్యలపై చర్చించాలి
గత బీఆర్‌ఎస్ సర్కారులో ధరణి పేరుతో ప్రైవేట్ భూములను 22-లో పెట్టారని, ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వంలో భూభారతి వచ్చిన తర్వాత కూడా లక్షల ఎకరాల సమస్యను ప రిష్కరించలేదన్నారు. ఒకరు నల్ల డ్రెస్, మరొకరు తెల్ల డ్రెస్ వేసుకుని తిట్టుకున్నట్లు నటిం చడం తప్ప.. ప్రజల సమస్యలపై చర్చ మాత్ర ం జరగడం లేదని పేర్కొన్నారు. స్పీకర్ చైర్ ను గౌరవించాలని, స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు.
ప్రజల సమస్యలపై చర్చించకపోతే ప్రజల గొంతు ఎవరు వినాలి? లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ అసెంబ్లీకి రారు.. రూలింగ్ పార్టీ కూడా తమ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వదు.. మరి ప్రజల సమస్యలను ఎవరు మాట్లాడాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు తమ డ్రామాలు ఆ పి ప్రజల సమస్యలపై చర్చించాలన్నారు.
అసెంబ్లీ ముట్టడికి వెళ్తే 1000 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేశారని, జిల్లాల్లో కూడా హౌస్ అరెస్టులు చేశార న్నారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దాడు లు చేయడంతో తమ నాయకులు గాయపడ్డారని, ఇది ప్రభుత్వ తీరు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు, చట్టాలు ఉన్నాయా? అన్నారు.
గవర్నర్‌ను కలిసి సమస్యను వివరిస్తాం
అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా పోరాడతారని, అసెంబ్లీ బయట తా ము ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్ర భుత్వం మెడలు వంచైనా సరే.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విద్యార్థులకు చేరే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. బకాయిల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా తాము గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరామని, అవకాశం ఇస్తే గవర్న ర్‌ను కలిసి విద్యార్థుల సమస్యను వివరిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కలె క్టర్లను కలిసి వినతిపత్రాలు అందజేస్తామని, అవసరమైతే ముట్టడి కార్యక్ర మాలు కూడా చేపడతామన్నారు.
అ సెంబ్లీలోనూ, అసెంబ్లీ బయట ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని, ఎన్ని రోజు లు సభ జరిగినా తమ ఉద్యమంం ఆగదన్నారు. ఢిల్లీ నాయకత్వం కూడా ఈ అంశంపై పూర్తి నివేదిక కోరిందని, తెలంగాణలో జరుగుతున్న పరిణామా లను జాతీయ నాయకత్వానికి వివరించామన్నారు.
రాహుల్ గాంధీ బయటకు వచ్చి మాట్లాడాలని అంటున్నారు.. తాము బయ ట అడగడం కాదు, అసెంబ్లీలోనే చర్చ పెట్టాలని అడుగుతున్నామన్నా రు. తమ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్‌బీ కలిసి కుట్ర చేస్తున్నాయని, అందుకే తాము బయట ప్రజల మధ్య పోరాడుతున్నామన్నారు. కాంగ్రెస్ కనీసం అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌నూ సక్రమంగా నిర్వహించలేదని, బీజేపీ ఉద్యమం ఇక్కడితో ఆగదన్నారు.
పోలీసుల తీరు అమానుషం
అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానుషం గా ఉందని రాంచందర్‌రావు మండిపడ్డా రు. పోలీసుల తోపులాట, లాఠీచార్జ్‌ల వల్ల పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు గాయాలయ్యాయని, పలువురు ఆసు పత్రుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశా రు. అసెంబ్లీ వద్ద ఆందోళనలో పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీర్‌పేట్ కార్పొరేటర్ సరళను పోలీసులు నిర్బంధించే క్రమంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
ప్రజా సమస్య లపై శాంతియుత ంగా నిరసన తెలుపుతున్న మహిళా ప్రజాప్రతినిధులు, యువమోర్చా నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేయడం గర్హనీయమన్నారు. ఒక్కరోజే వివిధ ప్రాంతా ల్లో 600 మందికి పైగా బీజేపీ, బీజేవైఎం శ్రేణులను అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. అరెస్టులు, అక్రమ కేసులతో తమ పోరాటాన్ని ఆపలేరని, ప్రభుత్వంపై పోరాడు తామని ఆయన తేల్చిచెప్పారు.
