సైమా అవార్డ్స్.. ప్రీతిరెడ్డి గ్లామర్ షో!
13-09-2026 | 01:19pm
బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్(SIIMA Awards)వేడుకలో సినీ తారలు సందడితో అట్టహాసంగా జరిగాయి. టాలీవుడ్, శాండల్‌వుడ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే ఈ వేడుకలో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రెడ్ కార్పెట్‌పై ప్రీతి రెడ్డి తన గ్లామరస్, స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సినీ తారలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె ముస్తాబై వేడుకలో సందడి చేశారు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్, స్టైల్, ఫొటోలకు పోజులిచ్చిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సైమా వేడుకకు హాజరైన పలువురు సినీ ప్రముఖుల మధ్య ప్రీతి రెడ్డి కూడా తన ప్రత్యేకమైన లుక్‌తో మెరిశారు. దీంతో ఆమెపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సినీ తారల ఈవెంట్లో ప్రీతి రెడ్డి గ్లామర్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.