జీతాలు పెంచాలని సింప్లీ ఫ్రెష్ కార్మికుల ఆందోళన

10-09-2026 | 03:18pm

చేర్యాల, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల గ్రామంలో గల సింప్లీ ఫ్రెష్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో(Simply Fresh Private Limited) పనిచేస్తున్న కార్మికులు(workers protest) గురువారం జీతాల పెంపు కోసం ఆందోళనకు దిగారు.పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదని, ప్రస్తుతం ఇస్తున్న జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయిస్తున్నారని,సంస్థలో ఏళ్లుగా పనిచేస్తున్నా జీతాల పెంపు విషయంలో యాజమాన్యం పట్టించుకోవడం లేదని, తక్షణమే న్యాయమైన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

మరిన్ని వార్తలు