సిరుల సింగరేణిని కాపాడాలి... కార్మికుల భవిష్యత్తును రక్షించాలి

16-09-2026 | 09:54pm

కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, భద్రత కల్పించాలి

చుంచుపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ(Singareni Company) ఎదుర్కొంటున్న ఆర్థిక, కార్మిక, ఉద్యోగ, సంక్షేమ సమస్యలు, వారసత్వ ఉద్యోగాల అంశం, మెడికల్ బోర్డులు, పెండింగ్ బకాయిలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి(MLC Enugula Rakesh Reddy) పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సింగరేణి అంటే తెలంగాణ సిరుల గని. సింగరేణి అంటే నల్ల బంగారం. సింగరేణి అంటే తెలంగాణ ఆత్మగౌరవం. తరతరాలుగా లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక, సామాజిక చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. దక్షిణ భారతదేశంలో బొగ్గు గనుల రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంది.

సింగరేణి సంస్థకు దాదాపు శతాబ్దన్నర చరిత్ర ఉంది. తెలంగాణతో పాటు పొరుగు ప్రాంతాల విద్యుత్, పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ సంస్థ కీలకంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను గౌరవించే బీఆర్ఎస్ పార్టీ, వారి సమస్యల పరిష్కారం కోసం కార్మికులకు మరియు సింగరేణి సంస్థకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు