సర్ గడువు పెంపు

08-09-2026 | 05:05am
  1. అక్టోబర్ 7 వరకు..
  2. నవంబర్ 9న తుది జాబితా 

హైదరాబాద్, సెప్టెంబర్  7 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఎస్‌ఐఆర్(SIR) (సర్) గడువు పొడిగిస్తూ ఎన్నికల సంఘం(Election Commission) నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్‌రెడ్డి(Sudarshan Reddy) విజ్ఞప్తితో ఈ గడువు పొడిగించింది. దీంతో క్లెయిమ్‌లు(Claims), అభ్యంతరాల స్వీకరణ(Receipt of Objections) కోసం అక్టోబర్ 7 వరకు అవకాశం ఉంటుంది. నవంబర్ 9న తుది ఓటర్ జాబితా(Voter List) ప్రచురిస్తారు. అందిన దరఖాస్తుల(Applications)ను పరిశీలించి, వాటిని పరిష్కరించే ప్రక్రియను నవంబర్ 5 లోపు పూర్తిచేయనున్నారు. ఎన్నికల సంఘం(Election Commission) కల్పించిన  ఈ గడువు పొడిగింపు అవకాశాన్ని రాష్ట్రంలో  ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని  ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. 

మరిన్ని వార్తలు