రక్తదాత కిరణ్ కు స్వధర్మ ఫౌండేషన్ సన్మానం

02-10-2026 | 03:32pm

ఉట్నూర్, అక్టోబర్ 02 ( విజయక్రాంతి ): గాంధీ జయంతిని పురస్కరించుకొని ఉట్నూర్ మండల కేంద్రంలో  ఇప్పటివరకు  37 సార్లు రక్తదానం చేసిన సామజిక కార్యకర్త బొడ్డు కిరణ్ ను స్వధర్మ ఫౌండేషన్(Swadharma Foundation) ఆధ్వర్యంలో శుక్రవారం శాలువాతో ఘనంగా సన్మానం చేసి అభినందించారు.

ఈ సందర్బంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కుడెల్లి అశోక్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ.. అత్యవసర సమయాల్లో రక్తం అవసరం ఉన్నవారికి ఆపద్దర్ముడిగా రక్తదానం చేసి ప్రాణదాత నిలుస్తున్న కిరణ్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పెందూరి ప్రభాకర్ న్యాయవాది మానాల లక్ష్మీనారాయణ నాయకుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు