ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష శిక్షణను ప్రారంభించిన ఎస్పీ

08-09-2026 | 05:30am

ఆదిలాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కో సం నిర్వహిస్తున్న ఉచిత ప్రాథమిక పరీక్ష శిక్ష ణ కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని డీటీసీ శిక్షణ కేంద్రంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కోసం ఏర్పాటుచేసిన పరీక్షలో దాదాపు 3500 మంది వి ద్యార్థులు హాజరుకాగా అందులో దాదాపు 300 మందిని ఎంపిక చేసి సోమ వారం నుంచి శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు.

పోలీ స్ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో ఉ న్న అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివిన ప్రతి ఒక్కరికీ విజయం సాధించే అవకాశం ఉంటుందని, హార్డ్వర్క్తోనే ఉద్యోగ సాధన సాధ్యమవుతుందని తెలిపారు. హైదరాబాద్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి నిష్ణాతులైన అధ్యాపకుల బృందంతో అభ్యర్థులకు నాణ్యమైన ప్రాథమిక పరీక్ష శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ శిక్షణలో ప్రతిరోజు, వారాంత పరీక్షలను నిర్వహిస్తూ అభ్యర్థులకు మరింత కఠినంగా శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. మొదటగా అభ్యర్థులందరూ ప్రాథమిక పరీక్ష లో ఉత్తీర్ణత సాధించేలా చదవాలని తెలిపారు. ఈ శిక్షణకు 300 మందికి పైగా అభ్యర్థులు ఎంపిక కాగా, 100 మంది నిరుపేదలకు, ఆ దివాసీ యువతకు ప్రత్యేక అవకాశం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి. మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, టూ టౌన్ సీఐ కె. నాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి. వెంకటి, నిష్ణాతులైన అధ్యాపకులు సాయిప్రసాద్, రూరల్ ఎస్‌ఐ వి. విష్ణువర్ధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు