సంఘ సేవక గణేష్ మండలిలో ఎస్పీ ప్రత్యేక పూజలు

21-09-2026 | 05:53pm

ఆసిఫాబాద్(విజయక్రాంతి): పట్టణంలోని బజారువాడిలో సంఘ సేవక గణేష్ మండలి(Sangha Sevaka Ganesh Mandali) ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం  మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ విశ్వప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగ, బీజేపీ నాయకురాలు సిద్ధంశెట్టి సుహాసిని, సతీష్ బాబు, మరుసుకుల సరస్వతి, కౌన్సిలర్ రాపర్తి కార్తిక్, సిల్వర్ ఎంకన్న, వినోద్, బాలకృష్ణ, ఆ వార్డు కౌన్సిలర్ కస్తూరి పుష్పలత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

మరిన్ని వార్తలు