హైదరాబాద్ లో స్పాటిఫై కొత్త ప్రచారం

23-09-2026 | 07:23pm

హైదరాబాద్: ఒక భర్త జుట్టు సరిచేసుకుంటూ సిద్ధమవుతుండగా, గదికి అవతలి వైపు నుంచి అతని భార్య “ఆహా!” అని అనడం వింటాడు. ఆ మాటకు మురిసిపోయిన అతను, మరింత శ్రద్ధగా తన జుట్టును సరిచేసుకుంటాడు. మరోసారి “ఆహా!” వినిపించడంతో, ఆమె దగ్గరకు వెళ్లి చూడగా, తన ఫోన్‌లో ప్లే అవుతున్న పాట పల్లవికి అనుగుణంగా పాడుతూ బట్టలు ఇస్త్రీ చేస్తూ కనిపిస్తుంది. మరో సన్నివేశంలో, ఒక రూమ్‌మేట్ పూర్తి ఉత్సాహంతో గిన్నెలు తోముతూ ఉంటుంది.

రెండో రూమ్‌మేట్ లోపలికి వచ్చి చూడగా, సింక్ నురుగుతో నిండిపోయి ఉంటుంది. తన రూమ్‌మేట్ సంగీత లయలో పూర్తిగా లీనమైపోయినా, ఆమె కడిగిన ప్రతి గిన్నె మాత్రం మచ్చ లేకుండా మెరిసిపోతూ ఉంటుంది. ఇవన్నీ “రోజ్ కే కామ్ ఫన్ బనావో, స్పాటిఫై చలావో” ప్రచారంలోని సరదా సన్నివేశాలు. స్పాటిఫై రూపొందించిన ఈ కొత్త ప్రచారం ఒక సరళమైన ఆలోచన చుట్టూ సాగుతుంది: సంగీతం జీవితంలోని ప్రత్యేక క్షణాలను మాత్రమే కాదు, రోజువారీ పనులను కూడా మరింత ఆనందంగా మార్చగలదు.

ఈ ప్రచారం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, భోజ్‌పురి అనే ఐదు భాషల్లో ఎనిమిది చిత్రాల సిరీస్‌గా విడుదలవుతోంది. ప్రతి చిత్రం ఈ ఆలోచనను విభిన్నమైన గృహ నేపథ్యాల్లో ఆవిష్కరిస్తుంది. బట్టలు ఇస్త్రీ చేయడం, గిన్నెలు కడగడం, లైట్‌బల్బ్ మార్చడం వంటి రోజువారీ పనులు చేస్తున్న వ్యక్తులు, సంగీతం ప్లే చేయగానే ఉత్సాహంగా, ఆనందంగా ఆ పనుల్లో లీనమైపోతారు. సెప్టెంబర్ 11–17 వారంలో అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), జంగీ రెడ్డి, కాసర్ల శ్యామ్‌ల ‘యేషనాగుల’ పాట స్పాటిఫై ‘టాప్ సాంగ్స్ ఇన్ హైదరాబాద్’ చార్టులో అగ్రస్థానంలో నిలిచింది.

ఆ తర్వాత ‘మల్లెపూల పల్లకి’, ‘నేనో బటర్‌ఫ్లై’ పాటలు నిలిచాయి. ఈ చార్టులో ‘ఆయా షేర్’, ‘యాలలో యాల’, ‘చికిరి చికిరి’, ‘కళ్యాణి’, ‘ఇరుముడి కట్టు’, ‘గాలి వాలుగా’, ‘చమికి’ వంటి పాటలు కూడా చోటు దక్కించుకున్నాయి.  షిప్రా శ్రీవాస్తవ, మార్కెటింగ్ హెడ్, స్పాటిఫై ఇండియా మాట్లాడుతూ, “సంగీతం ఒక క్షణం యొక్క అనుభూతిని మార్చే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంది. మీరు ఏ భాష మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా, సరైన పాట వినిపించినప్పుడు ఆ పని అనుభవమే భిన్నంగా మారుతుందన్నారు. భారతీయ వినియోగదారుల్లో 98% మంది స్పాటిఫై(Spotify) తమ దినచర్యలో ఒక ముఖ్యమైన భాగమని తెలిపారు.

మరిన్ని వార్తలు