శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతులు లేనందున తరగతులు నిలిపివేత
16-09-2026 | 03:21pm
విద్యార్థులను ఇంటికి పంపిన ఎంఈఓ కార్యాలయ సిబ్బంది
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో(Sri chaitanya school) 8,9,10 తరగతులకు విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతులు లేనందున జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున్(District Education Officer Mallikarjun) ఆదేశాల మేరకు బుధవారం ఎంఈవో కార్యాలయ సిబ్బంది విద్యార్థులను తక్షణమే ఇంటికి పంపించడం జరిగింది. ఇకపై తరగతులను నిర్వహించరాదని ఆదేశించడమైనది.
అనుమతి లేని తరగతులలో తమ పిల్లలను చదివించవద్దని తల్లిదండ్రులకు కూడా తెలియజేయవలే నని మ్యాజమాన్యానికి సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించినచో, పాఠశాల యాజమాన్యంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడునని ఎంఈఓ నాగేశ్వరరావు పేర్కొన్నారు.