కారేపల్లి క్రాస్ రోడ్ లో గణపతి మహా అన్నదానం
16-09-2026 | 04:10pm
సింగరేణి,(విజయక్రాంతి): సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డు(రామలింగాపురం)లో వినాయక నవరాత్రి మహోత్సవాల(Vinayaka Navratri celebrations) సందర్భంగా ఏర్పాటుచేసిన గణపతి మండప ప్రాంగణంలో బుధవారం మేకల రాంబాబు-ఉమా దంపతుల వితరణగా మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు.
పరిసర గ్రామాల నుంచి వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకొని, అన్న, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద దాత కుటుంబ సభ్యులు మేకల మానస,మౌనిక, రిస్విత కృష్ణ,గ్రామ పెద్దలు,యవత, గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.