భర్త చేతిలో భార్య హత్య
16-09-2026 | 04:11pm
కోరుట్ల, సెప్టెంబర్ 16 (విజయకాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బుధవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. కోరుట్లపట్టణంలోని ఝాన్సీ రోడ్లో నివాసం ఉంటున్న అన్నం లక్ష్మి అనే అంగన్వాడి టీచర్ హత్యకు గురైంది.భర్తే ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కుటుంబ కలహాలే హత్యకు కారణమా..?ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..?అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.ఈ ఘటనతో కోరుట్ల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.