కోరుట్ల లో శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవ వేడుకలు

01-10-2026 | 09:46pm

కొత్తపల్లి, అక్టోబర్ 01 (విజయక్రాంతి): శ్రీనివాస నామంతో ఏర్పడిన ఆత్మీయ బంధాలను మరింత బలోపేతం చేస్తూ, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యత లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవ(Srinivasa Mithrulu third Anniversary) వేడుకలను 2026 అక్టోబర్ 25వ తేదీ ఆదివారం కోరుట్లలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి తెలిపారు.

బెజ్జారపు (పెద్దోల్ల) శ్రీనివాస్(ఎస్ వి) గారి సహకారంతో, కోరుట్ల శ్రీనివాసుల సేవా సంస్థ శ్రీరాముల శ్రీనివాస్, నీలి శ్రీనివాస్‌ ఆద్వర్యంలో ఈ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా శ్రీనివాస నామంతో ఏర్పడిన మిత్రుల అనుబంధాన్ని సేవా భావంతో ముందుకు తీసుకెళ్తూ, సమాజంలో ఐక్యత, మానవత్వం, సేవా కార్యక్రమాల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ వార్షికోత్సవ వేడుకలకు శ్రీనివాస మిత్రులు, సేవా సంస్థ సభ్యులు, సలహా మండలి సభ్యులు, వివిధ ప్రాంతాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

“పేగు బంధం కాదిది… పేరు బంధం” అనే నినాదంతో శ్రీనివాసుల మధ్య ఆత్మీయతను, ఐక్యతను పెంపొందిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలకు ఈ వార్షికోత్సవం వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి, బెజ్జారపు (పెద్దోల్ల) శ్రీనివాస్(ఎస్ వి), శ్రీరాముల శ్రీనివాస్, నీలి శ్రీనివాస్, చిలుక శ్రీనివాస్, శ్రీనివాస్ బెజ్జారపు రమ్యశ్రీ జ్యువెలర్స్ భూషణ్రావుపేట  శ్రీనివాస్,  ఐలాపూర్ శ్రీనివాస్ గౌడ్,  పోతుగంటి శ్రీనివాస్ గౌడ్ మూడ పెళ్లి శ్రీనివాస్, వడ్నాల శ్రీనివాసరావు తూమ్ శ్రీనివాసరావు, రంజిత్ మేర శ్రీనివాస్, కాసారపు శ్రీనివాస్ మరియు మండలోజి శ్రీనివాస్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు