మహిళా సాధికారత దిశగా ముందడుగు

12-09-2026 | 06:50pm

రామగిరి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో నిర్వహించిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ విజయవంతంగా ముగిసింది. స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశీస్సులతో, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సౌజన్యంతో అలీఫ్ సంస్థ ఆధ్వర్యంలో రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో గత మే నెలలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణను ఏర్పాటు చేశారు.

శుక్రవారం రాజాపూర్ సర్పంచ్ పుల్లేల భాగ్యలక్ష్మి కొమురయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ధ్రువపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ, మహిళలు కుట్టుమిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబానికి అండగా నిలవడంతో పాటు సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు అందించిన సర్టిఫికెట్లతో భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో త్వరలోనే మన ప్రాంతంలో మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక కంపెనీలు రాబోతున్నాయని, తద్వారా స్థానిక మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని తిరుపతి యాదవ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కన్నూరి వెంకటి, వార్డు మెంబర్లు కాల్వ రజిత, పుల్లెల సుజాత, కన్నూరి శశికుమార్, ఎండీ ఆఫీస్ కాదాసి ఓదమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటేడి రవి, కన్నూరి పర్వతాలు, శ్రీనివాస్, తిరుపతి, రోహిత్, తిరుపతి, మల్లేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు