భగవద్గీత సందేశం ప్రతి ఇంటికి చేరేలా కృషి..

23-09-2026 | 04:56pm

బోథ్. సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): భగవద్గీత(Bhagavad Gita) సందేశం ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేస్తామని జైహింద్ గ్రూప్ సభ్యులు తెలిపారు. సోనాల మండల కేంద్రంలో ఇంటింటికి భగవద్గీత పంపినీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవద్గీతలోని జ్ఞానం ధర్మం కర్తవ్య బోధ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయని యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు గీత సందేశాన్ని గ్రహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 1600 భగవద్గీత గ్రంథాలు 1000 హనుమాన్ చాలీసా గ్రంధాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

మరిన్ని వార్తలు