చాట్‌జీపీటీ వినియోగం.. విద్యార్థి ప్రాణానికి కారణమైందా?
19-09-2026 | 11:07am
ముంబై: బాంబే ఐఐటీ(IIT Bombay)లో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పరీక్షలో చాట్‌జీపీటీ(ChatGPT) ఉపయోగిస్తూ పట్టుబడిన విద్యార్థికి హెచ్‌వోడీ కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం కూడా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మృతుడిని సాహిల్‌గా గుర్తించారు. సాహిల్ ఆత్మహత్య వార్తతో బాంబే ఐఐటీ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు రాత్రంతా నిరసన తెలిపారు. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ఐఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.