జాతీయ స్థాయి సాఫ్ట్‌బేస్‌బాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

18-09-2026 | 02:26pm

కాగజ్‌నగర్(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లాలో గురువారం నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి (Telangana State Level) జూనియర్, యూత్ సాఫ్ట్‌బేస్‌బాల్ పోటీల్లో(Softball competition) తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాల కాగజ్‌నగర్ బాలురు-1 విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

ఇంటర్ విద్యార్థి సయ్యద్ అర్షాన్ అద్భుత ప్రదర్శనతో హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మరో విద్యార్థి వి. పవన సుత కూడా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాడు. విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ బానోత్ జీవన్ లాల్, వ్యాయామ ఉపాధ్యాయులు బి. రాజశేఖర్, ఎన్. ప్రభాకర్, సిబ్బంది అభినందించారు.

మరిన్ని వార్తలు