3 September, 2026 | 11:58 PM

ఏసీబీ వలలో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్

03-09-2026 | 10:53pm

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య

హయత్ నగర్ లో ఉన్న నివాసంలో తనిఖీలు 

ఎల్బీనగర్: సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఏసీబీ వలలో చిక్కినట్లు సమాచారం. గురువారం ఉదయం ఏసీబీ అధికారులు సూర్యాపేట పట్టణంలోని మానస నగర్ లో ఉన్న సోమయ్య నివాసంలో అలాగే హైదరాబాద్ లోని హయత్ నగర్ డివిజన్ సూర్య నగర్ లో ఉన్న ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు, ఇతర ఆధారాలను  తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఏ కేసు నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టిందనే అంశంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.