కల్లూరులో ఘనంగా ఖోఖో క్రీడా ఉత్సవాలు
మువ్వ విజయబాబు జన్మదినోత్సవం సందర్భంగా 8 జట్లతో పోటీలు
కల్లూరు,(విజయక్రాంతి): మువ్వ విజయబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన అనుచరులు కాటేపల్లి కిరణ్ మట్టూరు జనార్ధన్ నిర్వహణలో కల్లూరు మండలంలో ఖోఖో క్రీడా ఉత్సవాలను(Khokho Sports Festival) ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు చెందిన మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా, నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిధులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ధారావత్ మోహన్ నాయక్(Municipal Chairman Dharavat Mohan Nayak), వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోట్రు అర్జున్‌రావు, విద్యాశాఖ అధికారి పొదిలి పద్మ కలిసి ప్రారంభించారు.ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.
క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు
ఈ పోటీల్లో పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(PM Sri Government High School) కల్లూరు గోల్డ్ మెడల్‌తో పాటు రూ.10 వేల నగదు బహుమతి, షీల్డ్‌ను కైవసం చేసుకుంది. ప్రతిభా హైస్కూల్ కల్లూరు సిల్వర్ మెడల్‌తో పాటు రూ.7 వేల నగదు బహుమతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరు బ్రాంజ్ మెడల్‌తో పాటు రూ.5 వేల నగదు బహుమతి సాధించాయి. తెలంగాణ హైస్కూల్ కల్లూరు నాలుగో బహుమతిగా రూ.3 వేల నగదు, షీల్డ్‌ను పొందింది.విజేతలకు ఈ నెల 6వ తేదీన మువ్వ విజయబాబు జన్మదినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు కాటేపల్లి కిరణ్‌కుమార్, మట్టూరు జనార్ధన్ తెలిపారు.






