20 August, 2026 | 1:54 AM

సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారం

20-08-2026 01:03 AM

లక్సెట్టిపేట, ఆగస్టు 19 : లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ రైతు సహ కార సంఘం నూతన చైర్ పర్సన్ గా పట్టణానికి చెందిన చెల్ల నాగభూషణం బుధ వారం ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సమక్షంలో నియామక పత్రంను పాలకవర్గానికి అందజేశారు. సభ్యులుగా కేతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నస్పూరి సత్యం, సంఘం శ్రీనివాస్, గంగినేని హరీష్, భాగ్యమ్మ, సు వర్ణ, సుధాకర్, జగ్గన్న, రాజయ్య, లింగయ్య, రత్తయ్య, జంగు ప్రమాణ స్వీకారం చేశారు.

గుల్లకోట చైర్ పర్సన్ గా పెయ్యాల దేవేందర్ రెడ్డితో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు, వెంకట్రావ్ పేట్ సర్పంచ్ నలిమేల రాజు, నాయకులు పూర్ణ చందర్ రావు, పింగళి రమేష్, దొంత నర్సయ్య, మోహన్, సుమన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.