గణపురం పీహెచ్ సినిసందర్శించిన బృందం

22-09-2026 | 07:15pm

గణపురం, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Ganapuram Primary Health Centre) కేంద్ర కుష్టు వ్యాధి బోధన, పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వీర కుమారన్, బృందం మంగళవారం సందర్శించింది. ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో కుష్టు వ్యాధిగ్రస్తుల వివరాలను సేకరించారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న చర్యలు, కార్యక్రమం ఉద్దేశాలను ఆరోగ్య కేంద్రం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఒంటిపై స్పర్శ లేని తెల్లటి మచ్చలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి తగిన మందులు వాడితే కుష్టు వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యాధికారి డాక్టర్ రాజు, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అల్లూరి అనూష, కార్యక్రమ అధికారి డాక్టర్ సందీప్ కుమార్, ఉప విభాగ అధికారి మల్లయ్య, సామాజిక ఆరోగ్య అధికారి రాజు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, జిల్లా వ్యాధి నిరోధక బృందం సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు