యూకేలో 2వేల విమానాలు రద్దు

10-09-2026 | 05:00am

సాంకేతిక సమస్యను సరిదిద్దుతామన్న నాట్స్

భారత్‌పైనా ప్రభావం.. పలు ఫ్లుట్లై రద్దు, దారిమళ్లింపు

లండన్, సెప్టెంబర్ 9: ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య(Technical issue) కారణంగా యూకేలో 2000 విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్నింటిని దారలిమళ్లించారు. ఈ మేరకు బుధవారం బ్రిటన్ నేషనల్ ఏయిర్ ట్రాఫిక్ సర్వీసెస్(Britain's National Air Traffic Services) (నాట్స్) ప్రకటించింది. ఈ అంతరాయానికి సైబర్‌దాడి కారణం కాదని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బాస్ తేల్చి చెప్పారు.

ఈ అంతరాయం భారత్‌కు రాకపోకలు సాగించే అనేక విమానాలపై కూడా ప్రభా వం చూపింది. మంగళవారం జరిగిన ఈ అంతరాయం వల్ల పదివేల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. దీని ఫలితం గా సుమారు 2,000 విమానాలు రద్దయ్యాయి. అంతేకాదు దాని పర్యవసానాలు రెండో రోజు కూడా కొనసాగాయి. యూకేలో అత్యంత రద్దీగా ఉండే హబ్ విమానాశ్రయమై న హీత్రూ, గాట్విక్, స్టాన్స్టెడ్, లూటన్, మాం చెస్టర్లతో పాటు రద్దులు, ఆలస్యాల జాబితా లో అగ్రస్థానంలో నిలిచింది.

సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు నిరంత రం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపిం ది. మరోవైపు యూకే రవాణా శాఖ కార్యదర్శి హైడీ అలెగ్జాండర్, నాట్స్ ముఖ్య కార్య నిర్వహణాధికారి మార్టిన్‌లు సమస్యను పరిష్కరించేందుకు నిపుణుల బృందంతో అత్య వసర సమావేశం ఏర్పాటు చేశారు. రద్దయిన విమాన సర్వీసులను రీ షెడ్యూల్ చే సేందుకు చర్యలు చేపట్టారు. అందాక ప్ర యాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కూడా సమావేశంలో నిర్ణయించారు.

కాగా ఈ ప్రభావం భారత్ విమానయాన సంస్థలపైనా పడింది. యూకేకు రాకపోకలు కొనసాగించే సర్వీసుల్లో అంతరాయం కలిగిందని ఏయిర్ ఇండియా సహా ఇతర సంస్థలు ప్రకటించాయి. కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయని స్పష్టం చేశాయి. ప్రయాణికులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ముంబై నుంచి 290 మంది ప్రయాణికులతో లండన్ వెళుతున్న ఏఐ విమానాన్ని జ్యూరిచ్‌కు మళ్లించాయి.

మరిన్ని వార్తలు