ప్రజా ప్రతినిధి అని మరిచిపోయిన గ్రామ సర్పంచ్?

01-10-2026 | 08:12pm

పదహారేళ్ల బాలుడిపై దాడి చదువుకున్న విద్యార్థులపై ఫిర్యాదులు?

కేసుల నుండి తప్పించుకోవడానికి మాపై  ఆరోపణలు: మాజీ సర్పంచ్ భర్త రాందాస్

సింగరేణి,(విజయక్రాంతి): సింగరేణి మండలం బజ్య తండ గ్రామపంచాయతీ(Bajyathanda Gram Panchayat)లో వినాయక నిమర్జనం(Vinayaka Nimajjanam) సందర్భంగా 16 ఏళ్ల బాలుడిపై గ్రామ సర్పంచ్ దాడి చేశారని బాధితుడు మరియు కాంట్రాక్టర్ రాందాస్ నాయక్  గ్రామస్తులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నిమర్జనం సందర్భంగా సర్పంచ్ మద్యం సేవించి తనపై దాడి చేశారని బాలుడు మీడియా సమావేశంలో ఆరోపించాడు. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో వినాయకుడికి పూజలు నిర్వహించానని, నిమర్జనం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపాడు.

ఘటన అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీకి పిలిచినప్పటికీ తాను హాజరు కావాల్సిన అవసరం లేదని, తనపై ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించినట్లు బాలుడు తెలిపాడు. తనపై జరిగిన దాడి ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే మాజీ సర్పంచ్ భర్త రాందాస్‌పై, గ్రామ యువకులపై ఆరోపణలు చేస్తున్నారని బాలుడు పేర్కొన్నాడు.

ఆరోపణలను ఖండించిన రాందాస్...

బాలుడి ఆరోపణలపై మాజీ సర్పంచ్ భర్త, కాంట్రాక్టర్ రాందాస్ స్పందిస్తూ వాటిని తీవ్రంగా ఖండించారు. గ్రామ అభివృద్ధి కోసం తాను, తన భార్య పనిచేశామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు.తాను ఎవరిపైనా దాడికి పాల్పడలేదని, తనకు ఎలాంటి గ్యాంగ్ లేదని ఎవరిపై తనకు కక్ష లేదని రాందాస్ పేర్కొన్నారు. తనపై, గ్రామ యువకులపై ప్రస్తుత సర్పంచ్ తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి పరువుకు భంగం కలిగించారని, ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలు తప్పు ఎవరిదో నిర్ధారించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాందాస్ కోరారు. అలాగే తనకు ప్రాణహాని ఉందంటూ సర్పంచ్ చేసిన ఆరోపణలు సైతం వాస్తవాలను పరిశీలించి గ్రామస్థాయిలో విచారించి తప్పు ఎవరిదైతే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో గ్రామస్తులు భాస్కర్, అజ్మీర కుమార్, మంగ్యా, రవి, దేవా, హరి, సాగర్, నవీన్, లక్ష్మణ్, వీరన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు