ప్రపంచ స్థాయికి తెలంగాణ బ్రాండ్

25-09-2026 | 05:45am
  1. అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి
  2. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పెట్టుబడులు పెంచాలి
  3. పర్యాటకంతో ఉపాధి, ఆదాయ వనరులు సృష్టించాలి
  4. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కా ర్యాచరణ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అధికారులను ఆదేశించారు.

పర్యాటక అభివృద్ధి అంటే కేవలం పర్యాటక ప్రదేశాల అభివృద్ధి మాత్రమే కాదని, తెలంగాణ బ్రాండ్‌ను ప్ర పంచానికి పరిచయం చేయాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి, ఆదాయ అవకాశాలను పెం చుతూ రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త స్థాయి కి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. గురువారం ప్రజాభవన్‌లో పర్యాటక, సాం స్కృతిక శాఖల ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులు, శాఖ పరిధిలోని ఆస్తుల వినియోగం, బడ్జెట్ కేటాయింపులు, ప్రైవేట్ పెట్టుబడులు, చారిత్రక కట్టడాల పరిరక్షణ, పర్యాటక బ్రాండింగ్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... పర్యాటక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలని, పబ్లిక్ పార్ట్‌నర్ షిప్(పీపీపీ) విధానంలో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ మేరకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదాయాన్ని సమకూర్చే విధ ంగా ఆస్తులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణలో టెంపుల్ టూ రిజం, ఎకో టూరిజం, హిల్ టూరిజం తదితర విభాగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేలా విస్తృత స్థాయిలో బ్రాండింగ్, మా ర్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌కు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కు ఆకర్షించేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. పర్యా టక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రైవేట్ రంగా న్ని భాగస్వామ్యం చేయాలని సూచించారు.

పెట్టుబడులకు అనుకూల వాతావరణం..

రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతలో కీలక భాగమని స్పష్టం చేశారు. రామప్ప వంటి చారిత్రక ప్రదేశాల్లో పరిరక్షణ, నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రభుత్వ సహకారం అందిస్తొమన్నారు. అదే సమయంలో కొత్త పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు.

ప్రభుత్వ బాధ్యతగా చేపట్టాల్సిన పరిరక్షణ కార్యక్రమాలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టగల అభివృద్ధి ప్రాజెక్టుల మధ్య సమతుల్యత పాటించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర, సం స్కృతి, పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెంచేందుకు ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని స మావేశంలో చర్చించారు. విద్యార్థులను చా రిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా రాష్ట్ర వారసత్వంపై వారికి అవగాహన క ల్పించాలని సూచించారు.

పర్యాటక రంగంపై చిన్న వయసు నుంచే ఆసక్తి పెంచడంతో పాటు భవిష్యత్ తరాలకు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు వివరించారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విషయం లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని భట్టి అధికారులకు సూచించారు. లీజు విధానాలు, ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యత, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన మార్పులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్ణీత కాల వ్యవధిలో కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పెట్టుబడులు, ఉపాధి, ఆదాయం పెంచడం ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి, ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రటరీ స్నిగ్ధా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు