తెలంగాణ ప్రజలు సెప్టెంబర్ 17న మరిచిపోలేరు
బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజలు సెప్టెంబర్ 17 రోజును మరిచిపోలేని దినమని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఐక్యత సహోదర భావానికి ఈరోజు నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని చాటిచెట్టు ఈరోజు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఎల్లవేళలా పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమరులను తెలంగాణ ప్రజలు ఏనాడు మరువలేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సరైన అన్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ అభివృద్ధి అనే నినాదంపైనే తెలంగాణ ప్రజలు ముందుకు వెళ్తున్నారన్నారు.