రెండేళ్లలో బీసీ రాజ్యం తెస్తా
17 నుంచి అసలైన యుద్ధం
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ టీఆర్పీ
పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సోమవారం పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణలో అసలైన రాజకీయ యుద్ధం ప్రారంభం కానుందని ప్రకటించారు.
దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలు కొద్దిమంది రెడ్డి, వెలమ వర్గాల చే తుల్లో బందీగా మారాయని, బీసీలు, ఎస్సీ లు, ఎస్టీలు, మైనారిటీలు జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అధికారంలో మాత్రం వారికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదని అన్నా రు. ఈ పాదయాత్రతో బీసీలకు రాజ్యాధికా రం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. రెండు సంవత్సరాల్లో బీసీ రాజ్యం తెస్తా అంటూ స్పష్టం చేశారు. 80 ఏండ్ల దోపిడి పాలనకు ముగింపు పలకడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ లక్ష్యమని పే ర్కొన్నారు.
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ టీఆర్పీ అని పేర్కొంటూ, కాం గ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బీసీలకు న్యా యం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని స్పష్టం చేశారు. పాదయాత్ర కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, సామాజిక చై తన్య యాత్ర అని మల్లన్న అన్నారు. ఈ యాత్రలో బీసీలకు జరిగిన అన్యాయాలు, అవకాశాల దోపిడీ, రాజకీయ అధికార కేంద్రీకర ణ గురించి గడప గడపకు వివరించనున్నట్లు తెలిపారు.
సమావేశం అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, యువకులు, మహిళలు, సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శు లు గంగాధర్ లింగాల, భవన వెంకటేష్, మదన్మోహన్ చారి, జ్యోతి పండల్, ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, ఆకుల హనుమాన్లు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు దేవళ్ల సమ్మ య్య, రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ కొట్టే, ప్రొఫెసర్ మురళి మనోహర్ పాల్గొన్నారు.
