రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత తమ్మి శెట్టికి ఘన సన్మానం

01-10-2026 | 10:39pm

సింగరేణి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత" రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు"(Telangana State Best Teacher Award) అందుకున్న తమ్మిశెట్టి శ్రీనివాస్ కు  కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల(Karepalli Government Junior College ) ప్రిన్సిపల్ విజయ కుమారి  ఆధ్వర్యములో అధ్యాపకులు, అధ్యకేతర సిబ్బంది విద్యార్థులు సంయుక్తంగా గురువారం అభినందన సభ నిర్వహించారు. శాలువ కప్పి మెమెంటోను అందజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ చేసిన కృషి ఫలితంగా రాష్ట్ర అవార్డు రావడం అభినందనీయమన్నారు.

నేడు చరిత్ర అధ్యాపకుడిగా విద్యార్థులకు అందిస్తున్న సేవలు మరువ లేనివి అన్నారు. చరిత్ర బోధన కష్టతరమైన విద్యార్థులకు సులభరీతిలో బోధిస్తూ చేస్తున్న కృషి కి గుర్తింపుగా రాష్ట్ర అవార్డు రావడం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది అన్నారు. మునుముందు మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టి జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రీ, అసోసియేట్ ప్రెసిడెంట్ మల్లెల రవీందర్, శాంతి నగర్ కళాశాల ప్రిన్సిపల్ గోవిందరావు గారు, చర్ల ప్రిన్సిపల్ నరేందర్, టి ఐ జి ఎల్ ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డిపి గణేష్ టేకులపల్లి ప్రిన్సిపల్ పవన్ జిల్లా హౌసింగ్ బోర్డు అధ్యక్షులు శేషు ప్రసాద్ గసుధారాణి  వేణు  దుర్గా ప్రసాద్ పార్థసారథి, యాకయ్య, వనిత బాబురావు, రాంబాబు,లక్ష్మీనారాయణ తదితరులు అభినందనలు తెలిపారు

మరిన్ని వార్తలు