అంగన్‌వాడీ టీచర్ల ఆందోళనలో ఉద్రిక్తత
- చలో హైదరాబాద్ కార్యక్రమం అడ్డుకున్న పోలీసులు
- ఇందిరాపార్కు నుంచి ర్యాలీగా వెళ్తున్న టీచర్ల అరెస్ట్
- అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట
ముషీరాబాద్, సెప్టెంబరు 9 (విజయక్రాంతి): అంగన్‌వాడీ టీచర్ల(Anganwadi teachers)కు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే(Assembly sessions) తమ సమస్యలు పరిస్కరించాలని డిమాం డ్ చేస్తూ తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(Telangana Anganwadi Teachers and Helpers Union) (సీఐటీ యూ) ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు(Indira Park) వద్ద నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రం నలుమూలలా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున మహా ధర్నాకు తరలివచ్చారు.
అయితే ధర్నాకు అనుమతి లేకపోవడంతో చలో హైదరాబాద్ ర్యాలీ నిర్వహించేందుకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఇందిపా ర్కు చౌరస్తా నుంచి అంగన్వాడి టీచర్లు, హె ల్పర్లు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షురాలు కె సునీత, ప్రధాన కార్యదర్శి పి జయల క్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం పద్మశ్రీ, కోశాధికారి పి మంగల ఆధ్వర్యంలో వందలాది మంది అంగన్వాడి టీచర్లు, హెల్పర్స్ ర్యాలీగా తరలివెళ్లేందుకు ప్రయత్నించగా ఇందిరా పార్కు చౌరస్తాలోనే వారిని పోలీసులు అడ్డుకుని ఆరెస్ట్ చేశారు.
దశలవారిగా వచ్చి ర్యాలీలుగా వెళ్లేందుకు ప్రయత్నించి న అంగన్వాడి టీచర్లు, హెల్పర్లను పోలీసులు ఎప్పటి కప్పుడు అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా సీఐ టీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, యూనియన్ ఆధ్యకురాలు సునిత, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి టీచర్లు హెల్పర్లకు ఇచ్చిన న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తమ న్యాయమైన హక్కుల సాదనకోసం పోలీసు లు అనుమతి ఇవ్వలేదని, దీంతో చలో హైదరాబాద్ ర్యాలీని శాంతియుతంగా నిర్వహిస్తు ంటే ఇందిరాపార్కు చౌరస్తాలో అడ్డుకొని ఆరెస్ట్ చేశారని ఆరోపించారు. అంగన్వాడి టీ చర్లకు కనీస వేతనం రూ 18వేలు, పీఎఫ్, ఈ ఎస్‌ఐ సౌకర్యాలను కల్పించాలని వారు డి మాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్య లు పరిష్కారం అయ్యేంతవరకు తమ పోరా టం కొనసాగుతుందని వారు హెచ్చరించారు.