అది విషప్రచారం

21-09-2026 | 05:40am
  1. బీఆర్‌ఎస్ నేతల మాటలు నమ్మొద్దు.. దళితుల భూములకు సంపూర్ణ రక్షణ
  2. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టీకరణ 
  3. దళితులకు, గిరిజనులకు స్థలాలు పంచిన చరిత్ర కాంగ్రెస్‌దే 
  4. భూ హక్కులను కాపాడటమే ప్రజాప్రభుత్వ ధ్యేయం 
  5. అంగుళం జాగా కూడా లాక్కోం.. రెవెన్యూ మంత్రిగా హామీ ఇస్తున్న 
  6. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): దళితులు(Dalits), గిరిజనుల భూముల(Tribal lands) విషయంలో బీఆర్‌ఎస్ దొరలు విష ప్రచారం చేస్తున్నారని.. దాన్ని నమ్మొద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy) సూచించారు. ‘దళితులు, గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజా ప్రభుత్వ విధానం కాదు. వారి అంగుళం భూమిని కూడా తీసుకోబోం. ఈ ప్రభుత్వం దళితుల భూములకు సం పూర్ణ రక్షణగా నిలుస్తుంది’  అని స్పష్టం చేశారు.

రెండున్నరేండ్ల కింద దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాల ప్రజల ఆశీస్సులతో, రేవంత్ రెడ్డి(Revanth Reddy)  నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడూ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉంటాయని.. దేశంలో, రాష్ట్రంలో వారి  అభ్యున్నతి కోసం చారిత్రాత్మక నిర్ణయా లు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

భూమిలేని దళితులకు   భూ సంస్కరణలు, భూ పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా భూములు ఇచ్చి ఆ భూమిపై హక్కు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉందని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ  హయాంలో దళితులకు సుమా రు 25 లక్షల ఎకరాల భూముల పంపి ణీ, అలాగే పోడు భూముల విషయంలో గిరిజనులకు సుమారు  2 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్‌దేని ఆయన వివరించారు. 

భూ హక్కులు కాపాడుతాం..

భూమిలేని వారికి భూమి, హక్కులు లేని వారికి హక్కులు కల్పించడమే కాంగ్రెస్ విధానమని.. దళిత, గిరిజనుల భూ హక్కులను కాపాడుతూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అధికారంలోకి వస్తే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చి, అధి కారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించారని, ఆ పార్టీ నేతల మాటలు నమ్మొద్దని సూచించారు.

సీఎం రేవంత్ తరఫున రెవెన్యూ శాఖ మంత్రిగా దళిత కుటుంబాలకు తాను స్పష్టమైన హామీ ఇస్తున్నానని పొంగులేటి తెలిపారు. “అంగుళం భూమి కూడా ప్రభుత్వం లాక్కోదు. మీ భూ మిని తీసుకునే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మీ భూముల విషయంలో మీరు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.  

సమస్యలకు పరిష్కారం..

భూములకు సంబంధించిన రికార్డుల పరిశీలన, సర్వేలు, భూ సమస్యల పరిష్కా రం వంటి ప్రక్రియలను ప్రజల భూములను లా క్కోవడానికి చేస్తున్న చర్యలుగా విషప్రచా రం చేస్తున్నారని..  ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయ డం, భూ వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. “దళితుల భూము ల విషయంలో కొంతమంది దొరలు కావాలనే భయాందోళనలు సృష్టిస్తూ విషప్రచా రం చేస్తున్నారు.

తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అలాంటి ప్రచారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి”  అని సూచించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి  దళితులకు, గిరిజనులకు హ క్కులు కల్పిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు.

సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల ప్రాంతంలోని 15 రెవెన్యూ గ్రా మాల్లో, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ద శాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం చూ పించామని వివరించారు. భూమిపై హక్కు లు కల్పించడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందేలా చర్య లు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు