అదే నా చివరి ప్రపంచ కప్

27-09-2026 | 05:25am
  1. గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా
  2. విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు

తిరువనంతపురం, సెప్టెంబర్ 26 : వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు(ODI series against West Indies) ముందు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)చేసిన వ్యాఖ్యలు క్రికె ట్ వర్గాల్లో సంచలనంగా మారాయి. 20 27లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబి యా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ భారత్ తరఫున తనకు చివరి ఐసీసీ టోర్నీ అని కోహ్లీ స్పష్టం చేశాడు. ఎలాగైనా ఈ కప్ గెలవడమే తన ప్రధాన లక్ష్యమని, అందుకోసం శాయశక్తులా శ్రమిస్తానన్నాడు. 50 ఓవర్ల క్రికెట్ లో ఉండే ఒత్తిడి, తీవ్రత మరే ఇతర ఫార్మాట్లోనూ ఉండదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

ఒకే రోజులో రెండున్నర టీ20 మ్యాచ్‌లు ఆడినంత సమయం మైదానంలో ఉండాల్సి వస్తుందని, సుదీర్ఘ టోర్నీలో అదే స్థాయి ఏ కాగ్రతను కొనసాగించడం శారీరకంగా, మా నసికంగా సవాల్‌తో కూడుకున్నదన్నాడు. అంచనాలు, బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మరిం త స్వేచ్ఛగా, రిస్క్ తీసుకుంటూ ఆడతానని కోహ్లీ వెల్లడించాడు. జట్టు స్కోరును 350-360 మార్కుకు చేర్చేలా అదనపు పరుగులు సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పాడు.

మరిన్ని వార్తలు