బీజేపీ నేతల అరెస్ట్‌లు అక్రమం

08-09-2026 | 05:00am
  1. విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్ చెలగాటం
  2. బీజేపీ కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 7(విజయక్రాం తి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు(Fee reimbursement arrears) చెల్లించాలని సోమవారం శాంతియుతంగా ఇందిరా పార్క్(Indira Park) వద్ద దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను(BJP leaders) పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లుతున్న బీజేపీ నేతలను పోలీసులు ఆమానుషంగా అరెస్టు(Arrest) చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌(Afzalgunj Police Station)కు తరలించారు.

ఈ అక్రమ అరెస్ట్‌లపై(Illegal arrests) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు(Students) ఫీజు రీయింబర్స్ చెల్లించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ వారి ఆత్మహత్యలకు కారణం అవుతూ వారి జీవితాలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని మండిపడ్డారు.

ఈ సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని  ప్రజలు గద్దె దించే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్ద పల్లి జిల్లా అధ్యక్షులు సంజీవ రె డ్డి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివెద మహిపాల్ రెడ్డి, తిమ్మాపూర్ మం డల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, మండల కిసాన్ మోర్చా కార్యదర్శులు మధుకర్ రెడ్డి, శ్రీనివా స్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు