బస్తీ బాయ్ లవ్‌స్టోరీ ప్రారంభం

29-09-2026 | 05:20am

మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్(Mohit Pedada, Srijita Ghosh) జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘రిచ్’. ‘ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఈ మూవీని రా జా నరేంద్ర తెరకెక్కిస్తున్నారు. ఎంజీ ఆర్ట్స్, ఐఎఫ్‌ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభరెడ్డి, మార్గం గోపి, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ దశరథ్, విక్రమ్ ఆదిత్య, పూజా కేంద్రే, ఆది త్య (డాంబర్), తపస్వీ రావ్, సిమ్రాన్ బొబ్బి లి, జబర్దస్త్ అజయ్, క్రాంతిరెడ్డి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రలానికి సా యికార్తీక్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా సతీశ్ రెడ్డి మాసం పనిచేస్తున్నారు. సోమవారం ఈ సినిమా పూజా ప్రారంభోత్సవం జరుగగా.. గోపీ మోహన్, దశరథ్, వీ సముద్ర, జీ రామ్‌ప్రసాద్, డీఎస్‌రావు, మిట్టపల్లి సు రేందర్, ముక్కు అవినాష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 

మరిన్ని వార్తలు