బంగారం వ్యాపారం వెనుక సిటీ ఆఫ్ గోల్డ్
విక్రమ్ ప్రభు 26వ చిత్రం ‘సిటీ ఆఫ్ గోల్డ్’(City of Gold). ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం (Director Siddharth)వహించారు. రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై రాహుల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుండగా, అమలా షాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలగం పెరుమాళ్, జాఫర్ ఇడుక్కి, జీఎం సుందర్, వసుంధర, సునీల్ సుగత, జయకుమార్, మౌరిష్ దాస్, బాల హసన్, లిజ్జీ ఆంటోనీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్ శనివారం విడుదలయ్యాయి. ఫస్ట్‌లుక్‌లో హీరో విక్రమ్ ప్రభు ఎంతో ఇంటెన్స్ లుక్‌తో కూర్చుని.. చాలా క్యాజువల్‌గా బంగారు కడ్డీలను విసురుతూ కనిపించారు. గ్లింప్స్‌లో సినిమా నేపథ్యాన్ని, పాత్రలను పరిచయం చేశారు.
బంగారం వ్యాపారం వెనుక పనిచేసే వ్యక్తుల జీవితాలు, ఈ వ్యాపారానికి అవతలి వైపు చోటుచేసుకునే రహస్య సంఘటనలను ఈ సినిమా తెరపై ఆవిష్కరించనుంది. ఈ చిత్రానికి డీవోపీ: కార్తీక్ శరాజ్; సంగీతం: యువన్ శంకర్ రాజా; యాక్షన్: దినేశ్ కాసి; ఎడిటర్: అరుల్ మోసెస్ ఎ; ప్రొడక్షన్ డిజైన్: హరి హరన్ పీఎస్.