కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చెడును ఎప్పుడూ కోరుకోలేదు
- ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నాం
టిపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్
అంబర్ పేట, సెప్టెంబర్ 9(విజయ క్రాంతి): అసెంబ్లీలో (Assembly) బీఆర్‌ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC President Mahesh Kumar Goud) రెండు సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా టిపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగభూషణం, కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, బొల్లు కిషన్, శ్రీకాంత్ నేత దిలీప్ కుమార్ నేత తదితరులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కేసీఆర్ చెడును కోరుకోలేదని, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యధిక సెక్యూరిటీ పొందుతున్న వ్యక్తి కేసీఆరే‘ అని మహేశ్ గౌడ్ తెలిపారు.
స్పీకర్ పదవి విషయంలో బీఆర్‌ఎస్ నేత తాతా మధు మాట్లాడిన తీరును ఖండించాలన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయాన్ని యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తోందని తెలిపారు. కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.