మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు
బిజెపి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు అర్జున్ రావు
సుల్తానాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలన దిశగా ముందుకు వెళుతుందని బిజెపి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మీసా అర్జున్ రావు అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్(Mandal BJP President Kandula Srinivas) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మీస అర్జున్ రావు, మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా “సేవా సంకల్ప్ అభియాన్ ” కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలిచి, సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, అలాగే పిల్లల భవిష్యత్తు కోసం,ఆత్మ నిర్భర్ భరత్ కోసం సర్వం ప్రధాని గారి సేవలకు, దేశ ఉజ్వలత కోసం, వికసిత్ భరత్ లక్ష్యంగా నిరంతరం ముందుకు వెళ్తుందన్నారు.