డ్రోన్ల ఉత్పత్తిలో భవిష్యత్ భారత్ దే

29-09-2026 | 05:05am

చలాది పూర్ణచంద్రరావు :

ప్రపంచ డ్రోన్ మార్కెట్లో(Global drone markets) అమెరికా, చైనాల(America, China) తరువాత భారత్ మూడో అతిపెద్ద డ్రోన్ మార్కెట్‌గా వున్నప్పటికి 2030 సంవత్సరం నాటికి మన దేశాన్ని డ్రోన్ హబ్‌గా మార్చి $ 3.2 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ సాధించతం ద్వారా ప్రపంచం డ్రోన్ తయారీలో(Global Drone Manufacturing) ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యం వైపు పయనిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తేదీ ఆదివారం రాత్రి ఆ లక్ష్యంలో మరో ముందంజ వేసిందని సగర్వంగా చెప్పాలి. నోయిడాలోని(Noida) ఓ ప్రైవేట్ రంగంలోని(Private sector) ఏరోస్పేస్ ఐజీ డిఫెన్స్ సంస్థ(Aerospace IG Defense Company) రూపొందించిన ’కాల్ డ్రోన్’ని రాజస్థాన్ ఎడారి ప్రాంతంలోని పోఖ్రాన్ ఫీల్ ఫైరింగ్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది.

ఇది ఇరాన్‌కు(Iran) చెందిన షాహెద్ శ్రేణి డ్రోన్‌లకు ధీటుగా రూపొందించటం ప్రపంచా న్నే దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పక తప్పదు. 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల సామ ర్థ్యం.. ఏకమార్గ దాడి చేయగల సత్తా కలిగిన ఈ స్వదేశీ కాల్ డ్రోన్ ద్వారా సుదూర మానవరహిత యుద్ధ వ్యవస్థలను నిర్మించాలన్న భారతదేశ ప్రయత్నంలో ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు.

నేటి ఆధునిక యుద్ధాలలో సుదూర, ఏకదిశాత్మక దాడి డ్రోన్లకు డిమాండ్ విపరీతంగా ఏర్పడింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో, మధ్యప్రాచ్య మరి యు సముద్ర సంఘర్షణలలో ఇరాన్‌కు చెందిన షాహెద్-136, రష్యాకు చెందిన గెరాన్- -2 డ్రోన్లను విస్తృతంగా ఉపయోగించాయి. దీని ద్వారా ఈ ఆయుధాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయనేది కూడా రుజువైంది. వీటి ఉత్పత్తి సాపేక్షంగా చౌకగా ఉండటం వల్ల, సైన్యాలు వీటిని అధిక సంఖ్యలో ప్రయోగించి, అధునాతన శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీ ర్యం చేయడంతో పాటు, వ్యూహాత్మక లక్ష్యాలపై నిరంతరం దాడి చేయగలిగే సామర్ధ్యం కూడా వుండటంతో వీటిపై ఎక్కువ ఆధారపడే అవసరం కలిగింది.

ఈ అవసరాన్ని గుర్తించిన భారత ప్రభు త్వం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని సా ధించడానికి తన సొంత, విస్తరించగల, సుదూర దాడి సామర్థ్యాలను నిర్మించుకునే ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. ఈ లక్ష్యంలో భాగంగానే నోయిడాకు చెం దిన ప్రైవేట్ రంగ ఐజీ డిఫెన్స్ సంస్థ, సరి గ్గా ఈ అవసరాన్ని తీర్చడానికే కాల్ (కేఏఎల్) ప్లాట్‌ఫాంను రూపొందించింది విజ యంతంగా ప్రయోగించింది. ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఇక ఈ కాల్ డ్రోన్ సాంకేతిక విషయాలు పరిశీలిస్తే గరిష్టంగా 200 కిలోల టేకాఫ్ బరువును కలిగి ఉండి, కీలకమైన దాడుల కోసం రూపొందించిన 50 కిలో ల అధిక- విస్ఫోటక వార్‌హెడ్‌ను మోసుకెళ్తుంది. గంటకు 160 నుండి 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఏడు నుండి ఎనిమిది గంటల పాటు ఏకపక్షంగా 5 వేల మీటర్ల ఎత్తులో ఎగరగలదు. లక్ష్యాలను కచ్చితంగా టార్గెట్ చేయగలిగే సామర్థ్యం ఉంది. అసలు ఏమాత్రం మా నవ ప్రమేయం లేకుండానే లక్ష్యాన్ని చేరుకునేలా చూసేందుకు, కాల్ అత్యంత సురక్షితమైన నావిగేషన్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఇది జామ్- రెసిస్టెంట్ మల్టీ- బ్యాండ్ శాటిలైట్ గైడెన్స్ (జిఎన్‌ఎస్‌ఎస్)ను, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఐ ఎన్‌ఎస్)తో మిళితం చేస్తుంది.

ఈ నూతన తయారీ కాల్ డ్రోన్, శత్రు రాడార్ వ్యవస్థలు, వాయు రక్షణ బ్యాటరీలు మరియు కీలక మౌలిక సదుపాయా లతో సహా అత్యంత విలువైన లక్ష్యాలను స్వయంప్రతిపత్తితో నావిగేట్ చేసి, నాశనం చేసేలా రూపొందించటం జరిగింది. యు ద్ధరంగంలో, కాల్ ఐజీ డిఫెన్స్ వారి ’గ్రిడ్ స్ట్రైక్’ ఆయుధాల పోర్ట్‌ఫోలియో కింద పనిచేస్తుంది. ఇది ఆ సంస్థ యొక్క గ్రిడ్ బ్యాటి ల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో సజావుగా అనుసంధానించబడుతుంది. ఈ సిస్టమ్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నెట్‌వర్క్.

ఇది కమాండర్లకు మానవరహిత ఆయుధాలను సమన్వయం చేయడానికి మరియు యుద్ధ నిఘా సమాచారాన్ని అత్యవసర సమయంలో ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుంది. నోయిడాలోని ఐజీ డిఫెన్స్ సంస్థ పోఖ్రాన్ పరీక్షల వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరిస్తూ ‘పోఖ్రాన్లో కాల్ డ్రోన్ పరీక్ష విజయవంతంగా పూర్తి కావడం తమ ఐజీ డిఫెన్స్‌కు మరియు అధునాతన రక్షణ సాంకేతికతలో స్వావలంబన దిశగా భారతదేశం సాగిస్తున్న మేక్ ఇన్ ఇండియా ప్రయాణానికి ఒక ముఖ్యమైన మైలురాయి’ అని వర్ణించటం ఆ సంస్థ రక్షణరంగ ప్రాముఖ్యతను తెలియ చేస్తోందని చెప్పాలి.

ఇటీవలి ప్రపంచ సంఘర్షణలు, కమికాజీ డ్రోన్లు ఇప్పుడు కచ్చితమైన దాడులు, వాయు రక్షణ మరియు వ్యూహాత్మక నిరోధానికి అత్యంత కీలకమైనవని నిరూపించాయని కూడా ఆ సంస్థ వివరించటం గమనార్హం. ‘మాకు ఇది కేవలం మరో డ్రోన్‌ను అభివృద్ధి చేయడం మాత్రమే కాదు, వేగంగా వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత సంతరించుకుంటున్న రంగంలో సార్వభౌమ భారత సామర్థ్యాన్ని నిర్మించడం’ అని ఆ సంస్థ విజయగర్వంగా చెప్పటం అంటే నిజంగా భారత్ రక్షణ రంగంలో ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగంలో కూడా సాధిం చటం మరో మైలురాయి అని చెప్పవచ్చు. 

ఈ ప్లాట్‌ఫాంను ప్రత్యేకంగా దేశీయంగా భారీస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఐజి డిఫెన్స్ కృతనిశ్చయంగా వుంది. కాల్ డ్రోన్ విజయవంతమైన పరీక్ష, భారతదేశ మానవరహిత ఆయుధాగారాన్ని విస్తరించేందుకు ఐజీ డిఫెన్స్ చేపట్టిన బృహత్ ప్రయత్నంలో ఒక భాగం.  

ఈ సంస్థ ఇంటర్సెప్టర్ డ్రోన్లు, కంబాట్ ఫస్ట్-పర్సన్ వ్యూ డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్రోన్ సమూహాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫెయిర్ వ్యవస్థలు, మరి యు కౌంటర్-డ్రోన్ రక్షణలతో సహా అనేక రకాల అత్యాధునిక సాంకేతికతలను చురుకుగా భారత్ రక్షణ భాగంలో తమవం తుగా ఎంతో అంకితభావంతో అభివృద్ధి చేస్తోంది. పోఖ్రాన్‌లో కేఏఎల్ ప్లాట్‌ఫాంను విజయవంతంగా ధృవీకరించడం తో, భవి ష్యత్ యుద్ధభూముల కోసం తన ప్రెసిషన్-స్ట్రైక్ సామర్థ్యాల ను ఆధునికీకరించే దిశగా భారతదేశం ఒక కీలకమైన అడుగు వేసిందనేది యుద్ధరంగ నిపుణులు కాదనలేని నిజం.

 సీనియర్ జర్నలిస్ట్, 

రక్షణరంగ నిపుణులు, 

491545699

మరిన్ని వార్తలు