ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యం

21-09-2026 | 08:45pm

- డీసీపీ భాస్కర్ 

భీమిని, (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్(DCP Eggadi Bhaskar) అన్నారు. సోమవారం భీమిని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి స్టేషన్ ఆవరణ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులను, క్రైమ్ రేట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌లోని రికార్డు గది, పరిసరాలను తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అదేశించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా గ్రామాల్లో ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని సూచనలు చేశారు. గణేశ్ నిమజ్జనంను ప్రశాంతంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఇరుపక్షాల దరఖాస్తులను పరిశీలించి బాధితులకు సత్వర న్యాయ సేవలు అందించాలన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కేసుల చేదనకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.

మరిన్ని వార్తలు