పసిడి కూత

27-09-2026 | 05:25am

గ్రామీణ క్రీడ కబడ్డీలో మన సత్తా మరోసారి రుజువైంది. మహిళల, పురుషుల జట్లు ఆసియా క్రీడల్లో పసిడి కూతతో దుమ్మురేపాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్లు తిరుగులేని ఆధిపత్యం కనబరిచి బంగారు పతకాలను కైవసం చేసుకున్నాయి. 

  1. కబడ్డీలో అదరగొట్టిన భారత్
  2. మహిళల, పురుషుల జట్లకు స్వర్ణాలు
  3. ఇరాన్‌పై అద్భుత విజయాలు

నగోయా, సెప్టెంబర్ 26 : ఆసియా క్రీడల్లో (At the Asian Games)అంచనాలు పెట్టుకున్న భారత కబడ్డీ (Indian Kabaddi)జట్లు అదరగొట్టేశాయి. అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు పసిడి పతకాలను పట్టేశా రు. రెండు విభాగాల్లోనూ ఇరాన్ జట్లను ఆటాదేసుకున్నాయి. ఉత్కంఠభరితంగా సాగి న ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హో దాలో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు  ఇరాన్‌పై అద్భుత విజయాన్ని నమో దు చేసింది. 37- స్కోర్ తేడాతో గెలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.

తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత జట్టు పూర్తి వ్యూహాత్మకంగా ఆడి ప్రత్యర్థిపై ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. భారత రైడర్లు వరుసగా పాయింట్లు సాధిస్తుండగా, డిఫెండర్లు కూడా విజయవం తంగా పాయింట్లను అడ్డుకున్నారు. అయితే సెకండాఫ్ లో ఇరాన్ పుంజుకుంది. ఆట ముగి యడానికి ఎనిమిది నిమిషాల సమయం మాత్రమే ఉందనగా భారత్ డిఫె న్స్‌ను ఛేదించి, ఆలౌ ట్ సాధించింది.

దీంతో ఒకదశలో ఈ రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఒకే ఒక్క పాయింట్‌కు తగ్గిపోయింది. ఈ దశలో భారత క్రీడాకారిణులు అద్భుతమైన రైడింగ్‌తో ప్రత్యర్థి డిఫెన్స్‌ను కంగారు పెట్టారు. ఆధిక్యాన్ని కాపాడుకుని మ్యాచ్ సొంతం చేసుకున్నారు. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన సంజు దేవి.. ఫైనల్లోనూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆసియా గేమ్స్ చరిత్రలో భారత మహిళల కబడ్డీ టీమ్ నాలుగోసారి విజేతగా నిలిచింది.

మరోవైపు పురుషుల కబడ్డీ ఫైనల్లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి ఇర్పా 40- తేడాతో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లూ పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఒక దశలో భారత్ 7- వెనుకబడగా, ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరాన్ 18- స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్‌లో భారత ఆటగాళ్లు పుంజుకుని అద్భుత ప్రదర్శన చేశారు.

ముఖ్యంగా డిఫెండర్ సుమిత్ కీలకమైన ట్యాకిళ్లతో ఇరాన్‌ను ఆలౌట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. దీనితో భారత్ 29 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ సునీల్ కుమార్ నాయకత్వంలోని భారత జట్టు ఆఖరి నిమిషాల్లో ఇరాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుబిగించి 40- స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత పురుషుల కబడ్డీ జట్టుకు ఇది 9వ స్వర్ణ పతకం.

మరిన్ని వార్తలు