24 June, 2026 | 6:03 PM

ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి

24-06-2026 05:24 PM

 కలెక్టర్ కె.హరిత

జైనూర్, జూన్ 24 (విజయక్రాంతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.బుధవారం జైనూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, సిబ్బంది హాజరు, సవరణ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.సర్వే పత్రాలను పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేయాలని, ఓటర్ల నూతన పాస్‌పోర్ట్ ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లతో మాట్లాడి గ్రామాల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచాలని తహసీల్దార్‌కు కలెక్టర్ సూచించారు.బూత్ స్థాయి అధికారులు ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం అందజేసి, పూర్తి చేసిన ఫారాలను తిరిగి సేకరించి యాప్‌లో వివరాలు నమోదు చేస్తారని ఆమె తెలిపారు. తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, జిల్లా యంత్రాంగం ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆడ బిర్షావ్, ఆర్ఐ మోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.