5 September, 2026 | 12:55 AM

‘హనుమాన్’ సక్సెస్ ‘డార్లింగ్’తో కంటిన్యూ అవుతుంది

08-07-2024 | 12:05am

ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానున్న తరుణంలో ఆదివారం ‘డార్లింగ్’ ట్రైలర్‌ను హీరో విశ్వక్‌సేన్ విడుదల చేశారు. విభిన్న నేపథ్యాలకు చెందిన ఒక యువ జంట కథతో రానున్న ఈ సినిమా ట్రైలర్ హాస్యభరిత సన్నివేశాలతో సాగింది.

ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పారిస్‌లో హనీమూన్‌కి తీసుకెళ్ళాలనుకునే అమాయకుడైన హీరో జీవితంలో, ఆనంది అనే అమ్మాయి భార్యగా ప్రవేశించిన తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది తెరపై చూడాల్సి ఉంది. అనన్య నాగళ,్ల బ్రహ్మానందం, రఘుబాబు, కృష్ణతేజ తదితరులు నటించారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ “కళామాతల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా. బలగం, మల్లేశం లాంటి సినిమాలు అందరికీ పడవు. రాసి పెట్టుండాలి. ఈ సినిమాతో నభా యాక్సిడెంట్ నుంచి కోలుకొని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తోంది. ఇది చాలా మందికి ఇన్స్ ప్రెషన్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్‌” అని చెప్పుకొచ్చారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ “డైరెక్టర్ అశ్విన్ వలనే ‘డార్లింగ్’గా మీముందు ఉన్నా. డార్లింగ్ అనగానే ప్రభాస్ అన్న పేరు వస్తుంది. అలాంటి టైటిల్ పెట్టుకోవాలన్నా భయంగా ఉండేది. అయితే కథని నమ్మి దానికి ఈ టైటిల్‌ని ఖాయం చేశాం” అన్నారు.

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ “యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నపుడు డార్లింగ్ కథ వచ్చింది. అశ్విన్ రాసిన క్యారెక్టర్ అద్భుతంగా వుంది. ఈ సినిమా కోసం చాలా మంచి టీం పనిచేశారు. ‘హనుమాన్’ సక్సెస్ ‘డార్లింగ్’ సినిమాతో కొనసాగుతుంది. ఇందులో దర్శిని సరికొత్తగా చూస్తారు. సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.

Latest News

article_84007398.webp
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. శోభాయాత్ర
05-09-2026 | 12:26am
article_78370952.webp
సురేఖ బర్తరఫ్ ను నిరసిస్తూ కండ్లకు గంతలతో నిరసన
05-09-2026 | 12:21am
article_89788748.webp
మహిళల హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ పోరుబాట
05-09-2026 | 12:15am
article_87692102.webp
ఒక వైపు సంబరాలు- మరో వైపు నిరసనలు
05-09-2026 | 12:09am
article_50548316.webp
వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం వాయిదా
05-09-2026 | 12:05am
article_71907328.webp
'కాంగ్రెస్'లో చేరిన బీజేపీ నేత కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి
05-09-2026 | 12:02am
article_22165615.webp
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.లక్ష ఆర్థిక సాయం
04-09-2026 | 11:53pm
article_58560565.webp
అమ్మ ఆశయం కోసం.. ఎంబీబీఎస్ సీటు సాధించిన చందన
04-09-2026 | 11:47pm
article_78773243.webp
చక్రేశ్వర శివాలయంలో వినాయక చవితి ఉత్సవాలకు ఆహ్వానం
04-09-2026 | 11:44pm
article_39840066.webp
వెయ్యి రోజుల పాలనపై మేడ్చల్లో బిఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శన
04-09-2026 | 11:41pm
article_45373918.webp
420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌
04-09-2026 | 11:35pm
article_85488818.webp
కల్లూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
04-09-2026 | 11:30pm