20 March, 2026 | 11:43 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

చిన్నారుల భద్రత గురించి ఆలోచించాల్సిన సమయమిది

08-07-2024 12:05 AM

సరాదా కోసమో, జ్ఞాపకాలనో తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచటం మూలంగా కొందరు క్రూరులు వాటిని ప్రమాదకర రీతిన వాడుతున్నారంటూ హీరో సాయి దుర్గా తేజ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.“సామాజిక మాధ్యమాలు క్రూరంగా, భయానకంగా మారిపోతున్నాయి. మీ పిల్లల ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్ వేదికల్లో పంచుకునేటపుడు ఓ మారు ఆలోచించండి. తద్వారా కొందరు మానవ మృగాల నుండి మీ పిల్లలను కాపాడుకోండి” అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

తల్లిదండ్రులు సాధారణంగా పోస్ట్ చేసే వీడియోలపై అసభ్యకరమైన కామెంట్లు, మార్ఫింగ్ వంటి విషయాలపై ఈ విధంగా స్పందించిన ఆయన, ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళారు. చిన్నారుల భద్రత గురించి ఆలోచించాల్సిన సమయమిదని పేర్కొన్న సాయి దుర్గా తేజ్, ఎక్స్‌లో తాను చేసిన పోస్ట్‌కి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు నారా లోకేశ్ అధికారిక ఖాతాలను ట్యాగ్ చేస్తూ, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఈ తరహా ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సందిగా వారిని కోరారు.