calender_icon.png 6 November, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టు తరువాతే..

08-07-2024 12:05:00 AM

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌కి ఉన్న క్రేజే వేరు. వీరిద్దరి కలయికలో ఇప్పటికే మూడు చిత్రాలు రాగా, వాటిలో ‘అఖండ’ సినిమా సీక్వెల్  కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల బాలయ్య  బోయపాటి కలయికలో ఓ సినిమా రానున్నట్టు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అది అఖండ సీక్వెల్ అని ప్రచారంలో ఉంది. తెలియవస్తున్న వివరాల ప్రకారం ఆగస్టు తరువాత ఈ సినిమా ఆరంభం కానుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అటు బాలయ్య సైతం తన 109వ సినిమా పనుల్లో తలమునకలై ఉన్నారు. ‘అఖండ’ చిత్రంలోని హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ పాత్ర సీక్వెల్‌లో కూడా ఉండనున్నట్టు సమాచారం. త్వరలో మరిన్ని వివరాలతో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.