సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి

25-09-2026 | 04:54pm

 జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ

బిజినేపల్లి సెప్టెంబర్ 25 : సకాలంలో సిలబస్(Timely syllabus) పూర్తి చేసి విద్యార్థుల(Students) విద్యాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా నోడల్ అధికారి శ్ వెంకట రమణ(District Nodal Officer Venkataramana) అన్నారు. శుక్రవారం మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలను(Palem Sri Venkateswara Government Junior College) జిల్లా నోడల్ అధికారి సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, నోట్ పుస్తకాలు, వంటివి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదవి మంచి మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి కళాశాలకు మంచి పేరు తేవాలన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వామి, కళాశాల అద్యాపకులు మదన్ మోహన్ రెడ్డి, అధ్యాపక సిబ్బంది తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు