నేడు అందరూ సభకు రావాలి
08-09-2026 | 04:15am
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్ విప్ జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ శాసనమండలి సభ(Telangana Legislative Council)కు మంగళవారం అందరూ రావాలని తమ పార్టీ ఎమ్మెల్సీలకు బీఆర్‌ఎస్ త్రీలైన్ విప్‌ను సోమవారం జారీ చేసింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నేపథ్యంలో పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి సమావేశాలకు తప్పనిసరిగా రావాలని ఆదేశించింది. పార్టీ విధానం ప్రకారమే చర్చలో మాట్లాడాలని పేర్కొంది. బిల్లు, తీర్మానం, ఓటింగ్‌లో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఈ విప్‌ను ధిక్కరిస్తే, వారిపై చట్టప్రకారం అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది.
