దంచికొడుతున్న భారీ వర్షం..
25-09-2026 | 03:11pm
- పల్లపు ప్రాంతాలు జలమయం..
- స్తంభించిన జనజీవనం పొంగిపొర్లుతున్న వాగులు..వంకలు
వెంకటాపురం, నూగూరు, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో (Venkatapuram Mandal)గురువారం సాయంత్రం నుంచి దంచి కొడుతున్న భారీ వర్షం కురుస్తుండటంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మిర్చి నారు నాటే పనులు నిలిచిపోయి, ఇప్పటికే నాటిన తోటల్లోకి నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరుగుతుండగా, పాలెం ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో నీరు చేరడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తేందుకు అప్రమత్తమయ్యారు. పెనుగాలులతో చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లపై పడటంతో పలు గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతాలకు ప్రజలు ఎవరు వెళ్లొద్దని అధికారులు సూచించారు.