భూమారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సుజిత్ రావు

01-10-2026 | 10:24pm

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం(Mallapur Mandal) ముత్యాంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఏలేటి భూమారెడ్డి(TPCC Delegate Sujith Rao) ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు గురువారం ముత్యాంపేటలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, మనోధైర్యం కల్పించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఖుతుబుద్దిన్ పాషా, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ మారు ఆనంద్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, మాజీ వీఏడీసీ చైర్మన్ దామ రాజేష్, ఎద్దులపురం అశోక్, నాయిని వెంకట గౌడ్, వెంకట గిరి, కల్లెడ గంగాధర్, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు