పొన్నం సత్తయ్యకు ఘన నివాళులు
ముకరంపుర,(విజయ క్రాంతి): రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తండ్రి, దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం కరీంనగర్‌లోని ఆయన ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పొన్నం సత్తయ్య సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar), జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra), కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ అలం,మాజీ శాసనసభ్యులు నాగుల సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుజరాబాద్ ఇన్చార్జి ఒడితల ప్రణవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.