అసెంబ్లీలో ‘ఏలేటి’ వ్యాఖ్యల దుమారం

10-09-2026 | 05:30am
  1. రేవంత్‌రెడ్డి రూల్ బుక్ నడుస్తుందా? 
  2. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారు 
  3. ప్రభుత్వంపై బీజేపీఎల్పీ నేత ఏలేటి విమర్శలు.. సభ నుంచి వాకౌట్ 
  4. సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో మాట్లాడతారా? 
  5. ఏలేటిపై డిప్యూటీ సీఎం, మంత్రులు ఆగ్రహం 
  6. పోడియం వద్ద ప్లకార్డులతో బీజేపీ సభ్యుల నిరసన 

హైదరాబాద్, సెప్టెంబర్  9 (విజయక్రాంతి) : బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Yeleti Maheshwar Reddy) చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో (Assembly)దుమారం రేపాయి. సభలోలేని సభ్యులను సస్పెండ్ చేయడం బాధాకరమని ఏలేటి అన్నారు. సభ ఉల్లంఘన జరిగినప్పుడు బీజే పీ సభపక్ష నేతగా కొన్ని అంశాలను ప్ర స్తావించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నియమ నిబంధనల ప్రకారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ప్రశ్నించారు.

కొత్తగా ఏమైనా పుస్తకం తయారు చేసుకున్నారా? అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి రూల్ బుక్ నడుస్తుందా? బీఏసీలో చెప్పినట్లు సభ నడుపుతారా లేదా? ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నా రు. 22 ఏపై ఎప్పుడూ చర్చిస్తారో చెప్పేవరకు సభలో మా ఆందోళన కొనసాగుతుం దని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు.

సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. వెంటనే మహేశ్వర్‌రెడ్డి మైకును స్పీకర్ కట్ చేయగా, బీజేపీ సభ్యులు పోడి యం వైపు వెళ్లే ప్రయత్నం చేయగా మార్ష ల్స్ అడ్డుకున్నారు. బీజేపీ సభ్యు లు అక్కడే చాలాసేపు నిరసన తెలిపారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం అజెండా అంశాలను ముందే ఇ వ్వట్లేదని ఆరోపించారు. స్పష్టమైన అజెండా ఇచ్చిన తర్వాతే సభకు వస్తామని స్పష్టం చేశారు. 

సభ హుందాతనాన్ని కాపాడాలి : డిప్యూటీ సీఎం భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సభా స్థానంలో ఉన్న వారి గౌరవా న్ని కాపాడేలా మాట్లాడాలని సూచించారు. సీఎంను ఏకవచనంతో మాట్లాడడం సరికాదని, సభ ఔన్నత్యాన్ని కాపాడటం సభ్యులం దరి బాధ్యతగా పేర్కొన్నారు. 

అభ్యంతరకరంగా మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు : స్పీకర్ 

సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడా రని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. ఏలేటి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంను అవమానపరిచి, ఏకవచనం ప్రయోగిస్తుంటే ఏం చేయాలని ప్రశ్నించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.

బీజేపీ సభ్యులకు ఇష్టం లేనట్లుంది : మంత్రి శ్రీధర్‌బాబు 

ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభా కార్యక్రమాలను పదేపదే అడ్డుకోవడం సమంజసమా అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. సభ సజావుగా సాగడం బీజేపీ సభ్యులకు ఇష్టం లేనట్లుగా ఉందన్నారు. ఎన్ని రోజులైనా సభ నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ భావజాలం ఒక్కటే : మంత్రి సీతక్క

సీఎం రేవంత్‌రెడ్డిని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడటం సరికాదని, ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. పోడియంలో ప్లకార్డులు ప్రదర్శించవద్దనే రూల్ ఉందని, కానీ.. బీజేపీ సభ్యులు అదే పని చేయడం అర్థరహిత మన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ భావజాలం ఒకటేనని, బీఆర్‌ఎస్‌కు మద్దతుగా బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

దళితులు వెళ్లిన నేలను ఎందుకు శుద్ధి చేశారు : మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం  

బీజేపీ సభ్యులు తమ వైఖరి మార్చుకుంటేనే మరింత ఎదుగుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. దళితులను అవమానించిన వారిని సమర్థించడం మంచి పద్ధతి కాదన్నారు.  తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడితే వారిని మెచ్చుకోవచ్చన్నారు. దళితులు వెళ్లిన నేలను ఎందుకు శుద్ధి చేశారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. సభ సజావుగా జరగడం బీజేపీ సభ్యులకు ఇష్టం లేనట్లుగా ఉందని విమర్శించారు.

మరిన్ని వార్తలు