గ్రీన్లాండ్ భద్రతపై అమెరికా శాశ్వత ఒప్పందం
వాషింగ్టన్: గ్రీన్ లాండ్ కు సంబంధించి అమెరికా డొనాల్డ్ ట్రంప్(America Donald Trump) కీలక ప్రకటన చేశారు. గ్రీన్ లాండ్ భద్రతపై అమెరికా శాశ్వత ఒప్పందం కుదుర్చుకుంది. డెన్మార్క్, గ్రీన్ లాండ్ లతో ఒప్పందం కుదిరిందని ట్రంప్(Donald Trump) ప్రకటించారు. ఈ ఒప్పందం రక్షణ, భద్రతా ప్రయోజనాల కోసం గ్రీన్ల్యాండ్లోకి అమెరికాకు శాశ్వత ప్రవేశాన్ని కల్పిస్తుందని, అలాగే అమెరికా శత్రువులుగా భావించే దేశాలు అమెరికా అనుమతి లేకుండా సున్నితమైన పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తుందని ట్రంప్ అన్నారు. త్వరలో గ్రీన్ లాండ్ లో భారీ సైనిక స్థావరం(Permanent security control) ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
"నా ఆదేశాల మేరకు, గ్రీన్లాండ్, యునైటెడ్ స్టేట్స్(United States) భద్రతను కాపాడేందుకు గ్రీన్లాండ్లో అవసరమైన చర్యలు తీసుకునే పూర్తి సామర్థ్యం అమెరికాకు శాశ్వతంగా ఉండేలా చూసేందుకు మేము డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రతినిధులతో కలిసి పనిచేశాము," అని ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో రాశారు. శుక్రవారం అంతకుముందు, ఆ ద్వీపంలో అమెరికా సైనిక ఉనికిని విస్తరించడానికి వాషింగ్టన్,గ్రీన్లాండ్ ఒక ఒప్పందానికి దగ్గరవుతున్నాయని, అయితే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ చిరకాల ఆశయానికి ఈ ఒప్పందం సరిపోదని మీడియా సంస్థలు వెల్లడించాయి