విశ్వనాథపల్లిలో పశువైద్య శిబిరం

16-09-2026 | 04:17pm

సింగరేణి,(విజయక్రాంతి): పశువుల ఆరోగ్య పరిరక్షణ, సంతానోత్పత్తి మెరుగుదల లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ(Animal Husbandry Department) ఆధ్వర్యంలో విశ్వనాథపల్లిలో బుధవారం ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఇస్లావత్ రాజు రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించగా, ఉప సర్పంచ్ బొమ్మల ధనమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి డాక్టర్ క్రాంతి కుమార్(Mandal Veterinary Officer Dr. Kranthi Kumar) మాట్లాడుతూ పశువుల్లో గర్భకోశ వ్యాధులను తొలిదశలో గుర్తించి చికిత్స అందించాలని సూచించారు.

పశువులకు సమతుల్య పోషకాహారం, ఖనిజ లవణాలు అందించాలని తెలిపారు. ఎద లక్షణాలను సకాలంలో గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించడం ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. సెక్స్ సార్టెడ్ సీమెన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈకార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ వెంకటేష్, గోపాలమిత్రులు మంగయ్య, శ్రీకాంత్, సమ్మయ్య, రామారావు, రవి, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు